తలసాని తప్పు చేశారు: తీగెల
హైదరాబాద్: పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తమ పార్టీ నేత తలసాని శ్రీనివాస యాదవ్ తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు తీగెల కృష్ణా రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడే అవకాశం శ్రీనివాస యాదవ్ కు ఉందని, అయినా తలసాని బహిరంగ విమర్సలు చేయడం సరి కాదని ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంపై పార్టీ అధ్యక్షుడితో చర్చించిన తర్వాత నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు.
పార్టీ ఓటమికి కారణాలను ఈ నెల 25, 26, 27 తేదీల్లో సమీక్షిస్తున్నామని, తెలంగాణ అనుకూల వైఖరి వల్ల ఓడిపోయామా, ఇతర కారణాల వల్ల ఓడిపోయామా అనేది సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శలు కాంగ్రెసు కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. శ్రీనివాస యాదవ్ ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల తాము ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications