ప్రజల నాడి అందలేదు: చిరు

'నేను లేకున్నా పార్టీ కొనసాగుతుందని మీరన్నారు. ఇది సరికాదు' అని చిరంజీవికి కొందరు నేతలు సూచించినట్లు తెలిసింది. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తున్నామో తెలియజేసేందుకే అలా వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలని, పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల్ని సమీకరించుకోవాలని కొందరు అధ్యక్షుడికి సూచించారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారిపట్ల ఉదారంగా ఉండాలని, పార్టీ నిర్మాణంలో వారి పాత్ర కూడా ఉందని మరికొందరు నేతలు సూచించారు. దీనికి 'కొందరి పట్ల అలా ఉండలేం కదా' అంటూ చిరంజీవి సమాధానమిచ్చినట్లు తెలిసింది శాసనసభ సమావేశాల్లో బాగా మాట్లాడారని, రానున్న సమావేశాలకు మరింత కసరత్తు చేయాలని కొందరు నేతలు చిరుకు సూచించారు.












Click it and Unblock the Notifications