చండీగఢ్: సినీనటి మోనికాబేడీ ఇప్పుడు భక్తిగీతాల రంగంలో మహారాణిగా వెలుగొందేందుకు బాటలు వేసుకొంటున్నారు. సిక్కుల భక్తి సంగీతానికి సంబంధించి ఓ ఆల్బం విడుదల చేశారు. మూల మంత్రం అనువాదాలు, సిక్కుల పవిత్ర సంకలనం 'జాప్జీ సాహిబ్'లోని కొన్ని వ్యాసాలకు నేపథ్య సంగీతాన్ని సమకూర్చి ఈ ఆల్బంలో చేర్చారు. దీనిని యూనివర్సల్ మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది.
ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన మోనిక కేవలం ఆల్బం విషయాలను మాత్రమే ప్రస్తావించారు. 'బిగ్‌బాస్', 'ఝలక్ దిఖ్లాజా' రియాల్టీ షోల్లో పాల్గొన్న అనంతరం తనకు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయని వివరించారు.