చంద్రబాబుతో తలసాని భేటీ

అన్ని విషయాలు చంద్రబాబుతో తాను చెప్పినట్లు శ్రీనివాస యాదవ్ చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను పార్టీలోనే ఉంటానని, తానెక్కడికి వెళ్తానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను వేరే పార్టీకి వెళ్తే మీకు చెప్పే వెళ్తానని ఆయన మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తాను ఇంకా వేచి చూస్తానని ఆయన అన్నారు. అసమ్మతి నేతలపై చంద్రబాబు గురువారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా తనను పేరు పెట్టి చంద్రబాబు ఏమీ అనలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications