జాక్సన్ ఎమర్జెన్సీ కాల్ ఆడియో విడుదల
లాస్ ఏంజెల్స్: పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ తుది క్షణాల్లో సహాయం కోసం వచ్చిన ఫోన్ కాల్ ఆడియోను శనివారం లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. అందులో గుర్తు తెలియని ఓ వ్యక్తి అంబులెన్స్ అర్జంటుగా కావాలని కోరారు. ఇంటి అడ్రస్ చెప్పారు. 50 ఏళ్ల వ్యక్తి ఒకరు స్పృహ తప్పి పోయారని, ఆయనను రక్షించేందుకు ఓ డాక్టరు, తాను కలిసి సీపీఆర్ చేసినా ప్రయోజనం కలగటంలేదని, వైద్యసాయం కావాలని అర్ధించారు. ఆ సమయంలో డాక్టర్ ను మాట్లాడాలని కోరినా ఆయన రక్షించే యత్నాల్లో ఉండటంతో వీలు కాలేదు. దీంతో ఆపరేటర్ తాము వెంటనే అంబులెన్స్ పంపుతున్నట్లు తెలిపారు. దారిలో కూడా అవసరమైన సూచనలు ఇచ్చారు.
అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న డాక్టర్ అంబులెన్స్ వెళ్లేసరికి లేకపోవటంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు జాక్సన్ ఉంటున్న అద్దె ఇంటి సమీపంలో ఉన్న డాక్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాక్సన్ కు ఇంజక్షన్ చేసి వెళ్లిన తరువాత కొంతసేపటికే చనిపోయినందున భయంతో డాక్టర్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications