క్షమాభిక్షకు సరబ్ లాయర్ వినతి
ఇస్లామాబాద్: భారత ఖైదీ సరబ్ జిత్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని, లేదంటే మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన తరఫు న్యాయవాది రాణా అబ్దుల్ హమీద్ పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కోరారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సరబ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
తాము 2006లో మెర్సీ పిటిషన్ పెట్టామని, భారత ప్రభుత్వం నుంచి, సరబ్ కుటుంబ సభ్యుల నుంచి, ఇతర వ్యక్తుల నుంచి విన్నపాలు వచ్చాయని హమీద్ చెప్పారు. హమీద్ సుప్రీంకోర్టు చివరి రెండు విచారణలకు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications