గృహ నిర్బంధంలో తెరాస ఎమ్మెల్యేలు
కరీంనగర్: ఇద్దరు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులను శనివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెరాస శాసనసభ్యులు అరవింద్ రెడ్డిని, ఓదేలును కరీంనగర్ జిల్లాలోని రాజాపూర్ లో వారిని గృహ నిర్బంధం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాసితులు రాస్తారోకోకు దిగారు. దీంతో కరీంనగర్ లోని సింగరేణి క్యాలరీస్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కరీంనగర్ జిల్లా అక్కేపల్లి గ్రామంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విస్తరణకు భూములను సేకరించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకోవడానికి రైతులు, స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తెరాస శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications