హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణకు చెందిన పద్మాలయా స్టూడియోలో నిర్మాణాలను నిలిపేయాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పద్మాలయా స్టూడియోకు ప్రభుత్వం కేటాయించిన భూములను అన్యాక్రాంతం చేయరాదని కూడా హైకోర్టు ఆదేశించింది. పద్మాలయ స్టూడియోకు ప్రభుత్వం కేటాయించిన భూములపై వివాదం కొనసాగుతోంది.