బాంద్రా-వొర్లి సీ లింక్ కు మోక్షం

రు.750 కోట్లతో నిర్మించిన ఈ సీ లింక్ ముంబైకి, పశ్చిమ శివారుకు మధ్య ట్రాఫిక్ కు తెర తీస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల మధ్య మహిమ్ కాజ్ వే మాత్రమే ఉంది. దీంతో ముంబై నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్య చెప్పనలవి కాకుండా తయారైంది. ఈ లింక్ ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి.
ఈ సీ లింక్ ప్రారంభోత్సవానికి పెద్ద యెత్తున ఏర్పాట్లు చేశారు. ఇది పర్యాటక కేంద్రంగా కూడా పేరు పొందే అవకాశం ఉంది. గంటకు 50 కిలోమీటర్లకు మించి ప్రయాణించే వాహనాలను గుర్తు పట్టే ఆటోమేటిక్ సిస్టంను కూడా ఏర్పాటు చేశారు. కెమెరాలు కిలోమీటర్ల దూరంలో ఉండే వాహనాల చిత్రాలను ఫొటోలు తీయగలవు.












Click it and Unblock the Notifications