రామారావుకు చిరు పార్టీ సంఘీభావం
హైదరాబాద్: తనపై అక్రమ కేసుల బనాయింపునకు నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టిన కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావుకు ప్రజారాజ్యం పార్టీ సంఘీభావం తెలిసింది. ప్రజా ప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆ పార్టీ ప్రతినిధి శోభారాణి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రామారావును పరామర్శించనున్నారని తెలిపారు.
కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని టీవీ రామారావుపై కేసు నమోదైంది. ప్రభుత్వం అక్రమ కేసు బనాయించిందని ఆరోపిస్తూ టీవీ రామారావు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆయన సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications