టెర్రర్ లింక్స్: మణిపురి నటి అరెస్టు
ఇంఫాల్: ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణపై పోలీసులు ప్రసిద్ధ మణిపురి నటి ఉరికింబామ్ దేవితను అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని ఒక హోటల్ నుంచి ఆమెను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఒక ప్రముఖ వేర్పాటువాద నాయకుడితో ఉన్న సమయంలో ఈ అరెస్టు జరిగినట్లు పోలీసులు మంగళవారంనాడు వెల్లడించారు.
న్యూఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా ఆ నటిని ఇంఫాల్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఆయన చెప్పారు. అయితే ఆమె చేసిన నేరమేమిటనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు.
అవార్డు గ్రహీత అయిన ఆ 24 ఏళ్ల నటి పోలీసులు తీసుకుని వెళ్తున్నప్పుడు ఏడ్చింది. మణిపూర్ గ్లామర్ గర్ల్ దేవితాను చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు. దేవిత ఈ నెల 16వ తేదీన న్యూఢిల్లీలోని ఒక హోటల్ గదిలో కనిపించింది. ఆ సమయంలో నిషేధిత కంగ్లేయి యావోల్ కన్నా లుప్ ప్రముఖ నాయకుడు ఆర్ కె రఘునాథ్ ను పోలీసులు ఆరెస్టు చేశారు. తమ కూతురు అమాయకురాలని దేవితే తల్లి ఉమాబతి దేవి అంటున్నారు. కానీ రఘనాథ్ తో ఎందుకు గదిలో ఉందనేది మాత్రం చెప్పలేకపోతున్నారు.