గురుద్వారా హెడ్ పై ఇంగ్లాండులో దాడి
లండన్: ఇంగ్లాండు కోవెంట్రీ పట్టణంలో సిక్కుల గురుద్వారా హెడ్ జ్ఞాన్ సింగ్ పై ముసుగు ధరించిన ఒక వ్యక్తి దాడి చేశాడు. ఇనుప రాడుతో పలు మార్లు కొట్టాడు. దీంతో 72 ఏళ్ల జ్ఞాన్ సింగ్ గాయపడ్డాడు. ఫోలేషిల్ ప్రాంతంలోని గురుద్వారా గురు నానక్ ప్రకాశ్ నుంచి జ్ఞాన్ సింగ్ సమీపంలోని బస్ స్టాప్ కు నడుస్తుండగా ముసుగు ధరించిన వ్యక్తి అనుసరించి ఆయనను కొట్టాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాను బస్సు కోసం నడుస్తున్నానని, ముసుగు ధరించిన వ్యక్తి తనను అనుసరిస్తుండడం చూశానని, సాధారణంగా కారులో వెళ్తానని, అయితే ఆ రోజు కారు లేదని, దాంతో బస్సెక్కడానికి వెళ్తున్నానని, ఆ వ్యక్తి తనపై దాడి చేశాడని, తాను ఆత్మరక్షణ కోసం పోరాడానని జ్ఞాన్ సింగ్ చెప్పారు. తిరిగి వచ్చి నాలుగైదు సార్లు తనను కొట్టాడని ఆయన చెప్పారు. లిటిల్ పార్క్ స్ట్రీట్ స్టేషన్ పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications