నెల్లూరులో టెండూల్కర్ కు రేషన్ కార్డు
నెల్లూరు: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద నెల్లూరులో రెండు రేషన్ కార్డులు బయట పడ్డాయి. నెల్లూరు జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత బుధవారంనాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ విషయం బయట పడింది. సచిన్ పేరు మీద ఏకంగా రెండు రేషన్ కార్డులు బయట పడడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
భవనాలు, వాల్ పోస్టర్లకు కూడా అధికారులు రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఏరివేత కార్యక్రమంలో బయట పడింది. ఇప్పటి వరకు జరిపిన రెండు లక్షల కార్డుల పరిశీలనలో ఆరు వేల బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుంటుండడంతో అనర్హులు కూడా ఏదో రూపంలో వాటిని పొందిన సందర్భాలున్నాయి.












Click it and Unblock the Notifications