డెట్రాయిట్ బస్ స్టాప్ లో కాల్పులు
అమెరికా: డెట్రాయిట్ నగరంలోని ఓ బస్ స్టాప్‌లో నిలబడి ఉన్న ఏడుగురు యువకులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఆకుపచ్చ వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులతో విరుచుపడ్డారు. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని డెట్రాయిట్ పోలీస్ అధికారి డ్యాన్ తెలిపారు.
కాల్పుల్లో గాయపడినవారు 14 నుంచి 17 ఏళ్ల వయస్సువారు. దుండగులు కాల్పులు జరపడానికి గల కారణం తెలియదని పోలీసులు అంటున్నారు. సమ్మర్ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఈ సంఘటన జరిగింది. కాల్పులకు ముందు ఏ విధమైన సమస్య తలెత్తలేదని స్కూల్ ప్రిన్సిపాల్ జోనాథన్ మాథ్యూస్ చెప్పారు. స్కూల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications