స్వలింగ సంపర్కానికి ఢిల్లీ హైకోర్టు ఓకె
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం చట్టబద్దం చేసింది. ఐ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఐపిసి 377 సెక్షన్ సవరణ ద్వారా వయోజనుల్లో గే సెక్స్ ను నేరరహితంగా పరిగణించాలని చెప్పింది. ఈ తీర్పును వెలువరిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా, జస్టిస్ ఎస్ మురళీధర్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సమానత్వంపై చెప్పిన మాటలను ఉటంకించింది. సమానత్వమనే దాన్ని కేవలం పైపైనే చూడకూడదని, దాన్ని నిజమైన స్ఫూర్తితో చూడాలని నెహ్రూ అన్నట్లు బెంచ్ ఉటంకించింది. ఏ విధమైన వివక్ష అయినా సమానత్వ హక్కుకు వ్యతిరేకమైందేనని హైకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు తీర్పు భారత్ లో నివసిస్తున్న స్వలింగ సంపర్కులకు, గేలకు భావోద్వేగ పూరితమైందే. తమ హక్కుల కోసం వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇష్టం లేని సెక్స్ ను అంగీకరించని 377 సెక్షను కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హైకోర్టు తీర్పునకు ఢిల్లీ బయట ఉన్నవారు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తీర్పు తెలియజేస్తోంది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications