పెళ్లికి నిరాకరించినందుకే..: సుధాకర్
హైదరాబాద్: తనతో పెళ్లికి నిరాకరించినందుకే లావణ్యపై దాడి చేసినట్లు నిందితుడు సుధాకర్ చెప్పాడు. తాను కావాలని దాడి చేయలేదని అతను చెప్పాడు. హైదరాబాదులోని ఆల్మాస్ గుడాలోని కెఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న లావణ్యపై తోటి విద్యార్థి సుధాకర్ దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన లావణ్య యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.
సుధాకర్ ది కడప జిల్లా కాగా, లావణ్యది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి. అయితే ఇరువురు కూడా బంధులవుతారు. లావణ్యను తనకిచ్చి పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు చెప్పారని, అయితే ఆమె అందుకు నిరాకరించిందని సుధాకర్ చెబుతున్నాడు. ఆమె కోసం తానెంతో ఖర్చు పెట్టానని కూడా అంటున్నాడు. తనను కాకుండా మరెవరినైనా పెళ్లి చేసుకుంటే అంతు చూస్తానని అతను హెచ్చరిస్తూ వస్తున్నట్లు అంటున్నారు.
లావణ్యకు దాడిలో నాలుగు చోట్ల గాయాలు అయినట్లు ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు చెప్పారు. ఆమెకు చికిత్స చేస్తున్నట్లు, ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు చెప్పారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేమని వారంటున్నారు. మహిళా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications