విద్యార్థినిపై ప్రేమోన్మాది ఘాతుకం
హైదరాబాద్: హైదరాబాదులో ఓ ప్రేమోన్మాది తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని అల్మాస్ గుడాలో గల టికెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రేమోన్మాది తోటి విద్యార్థిని గొడ్డలితో దాడి చేశాడు. కళాశాలలోని ల్యాబ్ లో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గాయపడిని విద్యార్థిని లావణ్యను మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థి తోటి విద్యార్థిని లావణ్యపై తొలుత అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. లావణ్య తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కళాశాలలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది.












Click it and Unblock the Notifications