హరీష్ కు డిఎస్పీ క్షమాపణలు
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావుకు డిఎస్పీ శనివారం బహిరంగ క్షమాపణలు చెప్పారు. చేయి చేసుకున్నందుకు ఆయన ఈ క్షమాపణలు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ లో ఒక కేసులో ఇబ్రహీం, తదితర తెరాస నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ తెరాస నాయకులు, కార్యకర్తలు బంద్ కు దిగారు.
తెరాస బంద్ సందర్భంగా తెరాస కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవలో హరీష్ రావుపై డిఎస్పీ చేయి చేసుకున్నారు. దీంతో తెరాస కార్యకర్తలు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ కారణంగా డిఎస్పీ క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications