బడ్జెట్ నిరాశాజనకం: బిజెపి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదని బిజెపి వ్యాఖ్యానించింది. బడ్జెట్ ద్వారా గొప్ప సందేశమిచ్చిన దాఖలా ఏదీ లేదని, పూర్తి నిరాశజనకంగా ఉందని బిజెపి నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు.
బడ్జెట్ లో సమతుల్యత ఉందని, దీర్షకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఎంతో శ్రమ తీసుకున్నారని, సమర్థతను ప్రదర్సించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications