లోక్ సత్తాతో చర్చకు రెడీ: బాబు

శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అక్కడ ప్రజారాజ్యం వల్ల దెబ్బతిన్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో లోక్‌సత్తా వల్ల దెబ్బతిన్నామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ రెండు పార్టీలు చీల్చడంతో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరిందని అన్నారు. తమ పార్టీ అంతర్గత సమావేశాల్లో ఈ అభిప్రాయం వ్యక్తమైందని, ఏ పార్టీలైనా విశ్లేషణ చేసుకోవడం సాధారణమని చెప్పారు. విమర్శ, ప్రతి విమర్శ ఉంటాయి కానీ, ఏనాడూ ధర్నా చేయని లోక్‌సత్తా ఏకంగా తెదేపా కార్యాలయం ముందు ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌సత్తా పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? ఎంత వచ్చింది? అనేది కూడా చెప్పాలన్నారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని, ఎన్నికల ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని తాము గతంలోనే ప్రతిపాదించామని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications