కాంగ్రెసు వైపు తలసాని మొగ్గు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తనకు స్పష్టమైన హామీ వస్తే కాంగ్రెసులో చేరడానికే ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయన సోమవారం ఉదయం రహస్యంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెసు మేయర్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని తలసాని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే రాజశేఖర రెడ్డి నుంచి ఆయనకు స్పష్టమైన హామీ రాలేదు. దీంతో ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఇటీవల సమైక్యనినాదంతో చంద్రబాబుపై విమర్శలు చేసిన తలసాని శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. చంద్రబాబుతో భేటీ అనంతరం అంతా సద్దు మణిగిందనే అనుకున్నారు. కానీ అదేం జరిగినట్లు అనిపించడం లేదు. ఆయన కాంగ్రెసులోకి వెళ్లడానికే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తలసానిని కాంగ్రెసులోకి తెచ్చే విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఏం చేయబోయేది త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయన ఎవరికీ అందుబాటులో లేరు.












Click it and Unblock the Notifications