రిజిస్ట్రార్ బందీ: ఓయులో ఉద్రిక్తత
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ధర్నా మంగళవారం హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతకు దారి తీసింది. కామన్ మెస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కైలాష్ అనే విద్యార్థి గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతని ఆరోగ్యం క్షీణించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
విద్యార్థులు గంటల పాటు రిజిస్ట్రార్ ను గదిలో పెట్టి బంధించారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ చర్యకు పూనుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అధికారులకు, విద్యార్థి ప్రతినిధులకు మధ్య చర్చలకు ప్రాతిపదిక కల్పించారు. విద్యార్థుల మూడు డిమాండ్లను రిజిస్ట్రార్ అంగీకరించారు. అయినా విద్యార్థులు దిగి రాలేదు.












Click it and Unblock the Notifications