కిరణ్ ఫ్యామిలీకి 5 లక్షలు: వైయస్

కిరణ్ మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కిరణ్ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిరణ్ మృతదేహాన్ని రాష్ట్రానికి తెప్పించేందుకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కూడా ఆయన కోరారు. విదేశాల్లోని తెలుగు విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications