టెలిఫోన్ ఎక్చేంజీలో అగ్నిప్రమాదం
కోల్ కత్తా: కోల్ కత్తా హంగర్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని టెలిఫోన్ ఎక్చేంజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనతో 70 వేల ల్యాండ్ లైన్ ఫోన్లకు, 10 వేల బ్రాడ్ బాండ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ అగ్ని ప్రమాదం మంగళవారం రాత్రి సంభవించింది.
ఈ ప్రమాదం వల్ల సర్కస్ టెలిఫోన్ ఎక్స్ ఛేంజీ పరిధిలోని 55 రిమోట్ శాటిలైట్ ఎక్స్ చేంజీలకు కూడా నష్టం వాటిల్లిందని బిఎస్ ఎన్ ఎల్ అధికార ప్రతినిధి చెప్పారు. మంటలను అర్పడానికి 15 ఫైర్ టెండర్స్ పని చేశాయి. ప్రాణనష్టమేమీ సంభవించలేదు.












Click it and Unblock the Notifications