వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీదేవతకు అమెరికాలో అవమానం

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లక్ష్మీదేవత ఛాయాచిత్రంతో బర్గర్ కింగ్ వాణిజ్య ప్రచారానికి ఒడిగట్టడం అమెరికాలోని హిందువులకు ఆగ్రహం తెప్పించింది. లక్ష్మీదేవత ఛాయాచిత్రాన్ని వెంటనే అడ్వర్జైజ్ మెంట్ నుంచి ఉపసంహరించుకోవాలని వాషింగ్టన్ కు చెందిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది.

పవిత్రమైన స్టాక్ అనే శీర్షికతో బర్గర్ కింగ్ స్పానిష్ లో వాణిజ్య ప్రచారం చేస్తూ లక్ష్మీదేవత ఫొటోను ముద్రించిందని ఫౌండేషన్ తెలిపింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. సాంస్కొతిక, మత సున్నితత్వాన్ని మరిచిపోయినందుకు క్షమాపణలు కోరుతూ ఫౌండేషన్ కంపెనీకి ఓ లేఖ రాసింది.

పూర్తిగా వాణిజ్య అవసరాల కోసం ఒక మతానికి చెందిన పవిత్ర చిహ్నాన్ని మరో మతస్థులు వాడడం తప్పని ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా అన్నారు. పైగా మాంసాహార పదార్థాల వాడకానికి దాన్ని వాడడం మరీ దారుణమని ఆయన అన్నారు. బర్గర్ కింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన ప్రతిస్పందన రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X