హిందువులకు బర్గర్ కింగ్ క్షమాపణలు
వాషింగ్టన్: హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా స్పెయిన్ యాడ్ చేసిన బర్గర్ కింగ్ క్షమాపణలు చెప్పింది. బర్గర్ కింగ్ ప్రపంచంలోని 70 దేశాల్లో హ్యాంబర్గ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లను నడుపుతోంది. ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశంతో తాము ఆ యాడ్ చేయలేదని, అయితే తాము క్షమాపణ చెప్తున్నామని బర్గర్ కింగ్ బర్గర్ కింగ్ అధికార ప్రతినిధి డెనిస్ టి. విల్సన్ చెప్పారు.
తమ అతిథులకే కాకుండా వివిధ సమాజాలకు తాము విలువను, గౌరవాన్ని ఇస్తామని, లక్ష్మీదేవి చిత్రం ఉన్న యాడ్ స్పెయిన్ లోని మూడు రెస్టారెంట్ల ప్రమోషన్ కోసం మాత్రమే వాడామని, అయితే ఇందులో ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.హిందువుల పట్ల తమకున్న గౌరవభావంతో రెస్టారెంట్ల నుంచి ఆ యాడ్ ను తొలగించామని చెప్పారు.












Click it and Unblock the Notifications