ముందస్తు బెయిల్ కు ఎమ్మెల్యే యత్నం
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని నర్సింగ్ కళాశాలలో కేరళ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల్లో తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావు ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆయన అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నర్సింగ్ కళాశాలలో లైంగిక వేధింపులకు సంబంధించి సిఐడి అధికారులు దర్యాప్తు చేశారు. కేరళ విద్యార్థినులను వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు. వీటితో సిఐడి అధికారులు డిజిపి ఎస్ ఎస్పీ యాదవ్ కు ఒక నివేదిక సమర్పించారు. రామారావును కూడా సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామారావు ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications