చిరు పార్టీ రెండో ఆఫీస్ క్లోజ్

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ రెండో కార్యాలయం(ఓ-2) మూతపడింది. ఇక్కడి నుంచి నడిచిన కార్యకలాపాలన్నీ ఇకపై కేంద్ర స్థానం (ఓ-1) నుంచే సాగనున్నాయి. ఓ-2 భవన యజమాని అయిన పార్టీ రాష్ట్ర నేత తోట చంద్రశేఖర్‌ ఖాళీ చేయాలని అడిగినట్లు సమాచారం. దీంతో పార్టీ కార్యాలయాన్ని మూసేయక తప్పలేదని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందుగానే జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 46లో కార్యాలయాన్ని సిద్ధం చేశారు. తిరుపతి సభ అనంతరం అందులో కార్యకలాపాలు నడిచాయి. అయితే అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో తీవ్ర రద్దీగా ఉండేది. ఇది సరిపోకపోవటంతో అప్పటికే పార్టీలో చేరిన మహారాష్ట్ర క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 5లోని పెద్దభవనంలో ఓ-2ని ప్రారంభించారు.

ఎన్నికల్లో తోట చంద్రశేఖర్‌ గుంటూరు లోకసభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సైతం 18 శాసనసభ స్థానాలకే పరిమితం కావటంతో తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ఓ-2కి వచ్చే వారు బాగా తగ్గిపోయారు. అయితే ఆ కార్యాలయం తమ వ్యాపార అవసరాలకు కావాలని తోట చంద్రశేఖర్‌ పార్టీకి నెల క్రితం నుంచి చెప్పసాగారు. రెండు వారాల కిందట ఒక అంతస్తును మాత్రమే పార్టీకి వదిలి మిగిలిన రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆ ఒక్క అంతస్తునూ తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ కార్యాలయ కార్యదర్శి సైతం గురువారం ఓ-1కే వచ్చారు. నెలన్నర క్రితమే ఓ-2ని మూసేస్తున్నారని ప్రచారం జరగగా, చిరంజీవి జోక్యం చేసుకొని ఆ వార్తల్ని ఖండించారు. తాజాగా ఇది మూతపడుతుండటంతో ఈపరిణామం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+