బ్రహ్మణీపై పరిశీలక బృందం ఆగ్రహం
కడప: నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న బ్రహ్మణీ యాజమాన్యంపై సాగునీటి పరిశీలక బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మైలవరం జలాశయంలో బ్రహ్మణీ చేపడుతున్న పనులపై పరిశీలక బృందం శుక్రవారం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్టను, పంప్ హౌజ్ ను పరిశీలకుల బృందం పరిశీలించింది.
తక్షణమే పైపు లైన్ పనులను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. మైలవరం జలాశయం మధ్యలో బ్రాహ్మణి సంస్థ పైపు లైన్, రహదారి నిర్మాణం చేపట్టడంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేయించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన సాగునీటి శాఖను ఆదేశించారు.












Click it and Unblock the Notifications