పోలీస్ స్టేషన్ సమీపంలో హత్య
హైదరాబాద్: హైదరబాద్ నగరంలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ సమీపంలో పాత కక్షల కారణంగా మతిన్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన ఫిరోజ్‌అనే వ్యక్తి సోదరుడిని మతిన్ కొంతకాలం క్రితం హత్య చేశాడు. ఈ సంఘటన అనంతరం మతిన్ డబీర్ పురాలోని బంధువుల ఇంట్లోనే ఉంటున్నాడు.
సోదరుడి మృతికి ప్రతీకారంగా అదను కోసం ఎదురుచూస్తున్న ఫిరోజ్ తన స్నేహితులతో కలిసి మతిన్ ను కత్తులతో పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు మతిన్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications