ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మరోసారి బాంబులు పేలాయి. మియాన్ చన్ను ప్రాంతంలో మిలిటెంట్లు జన నివాస ప్రదేశాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులతో సహా పదిహేను మంది మృతి చెందారు. దాదాపు నూట యాభై ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరో పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉంది.