పోలీస్ స్టేషన్ పైకి తెగబడిన మావోలు

Chhattisgarh
ఛత్తీస్‌ గఢ్‌: నిన్న ఎస్పీతో సహా 38మందిని బలితీసుకున్న మావోలు సోమవారం ఉదయం మరోసారి విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌ గడ్‌ సమీపంలోని సీతారం పోలీస్‌ స్టేషన్‌ పై ఈ రోజు తెల్లవారుజామున దాడికి తెగబడ్డారు. భారీ మొత్తంలో స్టేషన్‌లోని ఆయుధాలను దోచుకెళ్లారు. వారిని ఎదుర్కొనేందుకు పోలీస్‌ లు వూహాత్మకంగా వ్యవహరిస్తూ స్థానిక గ్రామీణ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

ఒకేరోజు...మూడు ఘటనల్లో...ఒక ఎస్పీ, ఇద్దరు ఎస్‌ ఐలతో సహా 38 మంది జిల్లా సాయుధ దళ జవాన్లను (డీఏఎఫ్‌) బలి తీసుకున్నారు. వల మీద వలవేసి మరీ వరుస దాడులు చేశారు. మందుపాతర్లతో మృత్యుఘోష వినిపించారు. ఛత్తీస్‌ గఢ్‌ రాజధానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ సొంత నియోజకవర్గంలోనే నక్సల్స్‌ మారణహోమానికి పాల్పడ్డారు.

నిన్న మావోయిస్టులు చేసిన మారణ కాండ వివరాలు: ఆదివారం...తెలతెలవారుతుండగానే నెత్తుటి అధ్యాయం మొదలైంది. రాజ్‌ నంద్‌ గావ్‌ జిల్లాలోని మదన్‌వాడలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ నుంచి ఇద్దరు జవాన్లు స్నానం చేసేందుకు బయటికి వెళ్లారు. అంతే...మావోయిస్టుల చేతికి చిక్కారు. వీరిద్దరినీ నక్సల్స్‌ కాల్చిచంపారు. అంతటితో ఊరుకోలేదు. తదుపరి దాడులకూ ప్రణాళికలు రచించారు. మదన్‌ వాడకు అదనపు బలగాలు తరలివస్తాయనే గట్టి నమ్మకంతో మందుపాతరలతో సిద్ధంగా కూర్చున్నారు. సరిగ్గా...వారు ఊహించినట్లే జరిగింది. నక్సల్స్‌ ఇద్దరు జవాన్లను చంపినట్లు తెలియగానే రాజ్‌నంద్‌గావ్‌ ఎస్పీ వినోద్‌ కుమార్‌ చౌబే స్పందించారు.

అదనపు బలగాలను వెంట తీసుకుని స్వయంగా మదన్‌వాడకు బయలుదేరారు. ఖోరేగావ్‌ గ్రామం దాటారు. కార్కోటీ అనే ఊరికి చేరుతుండగా... మాన్‌ పూర్‌ వద్ద ఘోరం జరిగిపోయింది. పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్‌ రెండు శక్తివంతమైన మందుపాతర్లు పేల్చారు. పేలుళ్ల తీవ్రతకు ఎస్పీ, ఇతర జవాన్లు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. హతాశులైన జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం అవకాశమివ్వకుండానే మావోయిస్టులు మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎస్పీ వినోద్‌కుమార్‌ చౌబేతో సహా 28 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడి జరగడం గ మనార్హం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+