హైదరాబాద్: దూర ప్రాంతాలకు రాత్రి నడిపే ప్రైవేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని..రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. అలా లేకుంటే ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఆయన ఖచ్చింతగా చెప్పారు. అంతేగాక తెల్లవారుజామున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతండడంతో..ఉదయం 3గం.ల నుంచి 5గం.ల వరకూ బస్సులు నిలిపివేయాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. నిన్న ఉదయం కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనలో బస్సుడ్రైవర్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.