ఒంగోలు: రాష్ట్ర డీజీపీ ఎస్ ఎస్ పీ యాదవ్ ని ఓ మెంటల్ కేసుగా పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అభివర్ణించారు. ఓ పనికిమాలిన వాడిని తీసుకొచ్చి డీజీపీగా పెట్టారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని నన్నపనేని ఆరోపించారు. అలాగే కారంచేడులో కారంచేడు సర్పంచ్ పై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును ఎత్తివేయాలని ధర్నాలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, దగ్గుబాటి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.దాంతో ఘర్షణ తీవ్ర స్ధాయికి చేరింది.