ఇండియాలో ఇ-కామర్స్ పోర్టల్ ట్రేడస్

ట్రేడస్ ఇ-కామర్స్ సైట్ ఇప్పటికే 12 ఐరోపా దేశాల్లో పాపులర్ అయింది. ఒక్కో దేశంలో ఒక్కో బ్రాండ్ నేమ్ తో, ఒక్కో యూఅర్ ఎల్ తో నిర్వహిస్తున్నారు. బల్గేరియా, పోలెండ్, రష్యా తదితర దేశాల్లో వివిధ పేర్లతో ఇ-కామర్స్ సైట్లు నడుస్తున్నాయి. ఇండీయాలో మాత్రం http://www.tradus.in/ పేరుతో ఈ ఈ- కామర్స్ సైట్ నడుస్తోంది.
ఇండియాలో ఇ-కామర్స్ వ్యాపారం నిర్వహించేందుకు కంపెనీ ఇటీవల రాహుల సేథీని ప్రెసిడెంట్ గా నియమించింది. ఇంతకు ముందు సేథీ మొబైల్ ఎన్ ఎక్స్ ట్.డాట్ కామ్ లో బిజినెస్ హెడ్ గా పనిచేశారు. సేథి సిఇవో ఆశిష్ కశ్యప్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ట్రేడస్ బి టు సి, సి టు సి సెగ్మంట్లపైనే దృష్టి సారిస్తుందని సేథి చెప్పారు.
కంపెనీలు తమ ఉత్పత్తులని నేరుగా తమ సైట్ ద్వారా వినియోగదారులకు అమ్ముకోవచ్చని సేథీ చెప్పారు. కొనుగోళ్ళు, అమ్మకాలు, వేలాలు తమ సైట్ ద్వారా జరుగుతాయన్నారు. మొదటగా ఈ సంస్ధ హైదరాబాద్, చెన్నై, ముంబయ్, ఢిల్లీ, కోల్ కతా, బెంగుళూరు నగరాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ఇ-కామర్స్ సైట్ కాబట్టి వినియోగదారుల విశ్వసనీయతను చూరగొంటుందనడంలో ఆశ్చర్యం లేదు.












Click it and Unblock the Notifications