హైదరాబాద్: తెదేపా నేత నన్నపనేని రాజకుమారిపై కారంచేడులో జరిగిన దాడిని ఆ పార్టీ ఖండించింది. ఈ సంఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ ను నియమించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రరాపా అధినేత చేసిన వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు.