టెహ్రాన్: ఇరాన్ లో ఓ విమానం కూలిపోయింది. నార్త్ క్వాజిన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులతో సహా 150 మంది మృతి చెందారు. విమానం టెహ్రాన్ నుంచి ఆర్మేనియా రాజధాని యెర్వాన్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన అధికారులు విమాన శకలాల కోసం ప్రయత్నాలు ఆరంభించారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇది మూడో విమాన ప్రమాదం. ఇది వరకు ఫ్రాన్స్, యెమెన్ విమానాలు కూలిపోయాయి.