'భారత్ లో ముద్దులు వద్దు'
లండన్: 'హంసల్లో హంసల్లా..కాకుల్లో కాకుల్లా ఉండాలి.. అలాగే భారత్ లో భారతీయుల్లా ప్రవర్తించండి..బ్రిటన్ లోలాగా అమ్మాయిల్ని ముద్దుతో పలకరించొద్దు..మీ చెంపలు చెళ్లుమంటాయ్'...ఇదీ భారత్ లో దుకాణాలు నెలకొల్పాలనుకుంటున్న బ్రిటన్ కంపెనీలకు రెండు దేశాల సంయుక్త వాణిజ్య మండలి(యూకేఐబీసీ) ఇచ్చిన సందేశం! బర్మింగ్ హామ్ లో, దానికి చుట్టుపక్కల ఉన్న పలు కంపెనీల సిబ్బందికి ఈ వాణిజ్య మండలి హెచ్ ఎస్ బీసీ బ్యాంకుతో కలిసి వారంపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించింది. భారతీయులను అర్థం చేసుకుని ప్రవర్తించాలని సూచించింది. వ్యాపార కార్యకలాపాలు విస్తరించడానికి భారత్‌కెళ్లే కంపెనీ సిబ్బంది 'భారీ తప్పులు' చేసి ఇబ్బందుల్లో పడుతుంటారని పేర్కొంది. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలగకుండా ప్రవర్తిస్తేనే వ్యాపార రంగంలో రాణించగలమని సూచించింది.












Click it and Unblock the Notifications