హైదరాబాదు: సీపీఎం కార్యదర్శి రాఘవులుకు నిజంగానే తలకాయ లేదని రాస్ట్ర క్రీడలు, ఐటీ శాఖ మంత్రి కోమట్ రెడ్డి విమర్శించారు. రాష్ర్ట మంత్రివర్గంలో నేరచరితులు ఉన్నారన్న రాఘవులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం తీవ్రంగా స్పందించింది. నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వారు హితవు పలికారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి రాఘవులు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.