నువ్వు యూజెలెస్ ఫెలో:నాగం
మహబూబ్‌నగర్: నువ్వు యూజ్‌లెస్ ఫెలో! టీడీపీ ఎమ్మెల్యేలు బిచ్చగాళ్లు! నువ్వు బియ్యం రెడ్డివి!! వాడెవడు నన్ను అడగడానికి.. జాగ్రత్తగా మాట్లాడు.. మహిళా మంత్రివని ఊరుకుంటున్నా అంటూ జిల్లా సమీక్ష సమావేశంలో టీడీపి ఎమ్మెల్యేలపై కాంగ్రేస్ మంత్రులు విరుచుకుపడ్డారు. దీనికి తగినట్లుగానే తెదేపా ఎమ్మెల్యేలూ దీటుగా స్పందించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డిలు వాగ్యుద్ధానికి దిగారు. తొలుత టీడీపీ సభ్యులను ఉద్దేశించి కాగితం పులులు అని ఇన్‌చార్జి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రావుల చంద్రశేఖరరెడ్డి చర్చకు పెట్టారు. 'అవును మీరు కాగితం పులులే' అంటూ కోమటిరెడ్డి మరోసారి అదే వాదన చేశారు.
దీనికి ఆగ్రహించిన నాగం జనార్దనరెడ్డి.. జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఇన్‌చార్జి మంత్రిని యూజ్‌లెస్ ఫెలో అని తిట్టారు. తమపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీంతో కోమటిరెడ్డికి కోపం వచ్చింది. మీరే పద్ధతి మార్చుకోవాలంటూ ఎదురుదాడికి దిగారు.
'మీరు బియ్యంరెడ్డి అని మాకు తెలుసు.బియ్యం తినే ఖర్మ మాకు పట్టలేదు' అంటూ కోమటిరెడ్డి ఘాటుగా విమర్శించారు. దీంతో మండిపడ్డ నాగం.. 'నేను బియ్యం తిన్నట్లు నిరూపించక పోతే రాజీనామా చేసి ముక్కు భూమికి రాస్తావా?' అని సవాలు విసిరారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీడీపీ ఎమ్మెల్యేలు తొమ్మిది మందీ లేచి నిలబడి.. మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో చర్చ పక్కదారి పట్టింది. దయాకర్‌రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'ఇక్కడే అధికారులంతా ఉన్నారు.. అడగండి..' అని అన్నారు. దీంతో వెంకట్‌రెడ్డి, అరుణ ఇక చర్చ పొడిగించలేదు.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications