మంత్రుల్లో నక్సలైట్లు ఎవరు?
హైదరాబాద్: రాష్ట్ర మంత్రుల్లో నక్సలైట్లు ఉన్నారంటూ రాఘవులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపిన సంగతి తెలిసిందే.దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత, వ్యవ సాయ శాఖ రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న న క్సలైట్ల వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులను ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమానికి స్వస్తి పలకాలని ఈ సందర్భంగా రాఘవులకు మంత్రి సలహా ఇచ్చారు. ఈ సందర్బంగా రాష్ట్ర సీపీఎంను టీడీపీ అధినేత చంద్రబాబుకు రాఘవులు తాకట్టు పెట్టారని విమర్శించారు.అలాగే రాష్ట్ర మంత్రుల్లో నక్సలైట్లు ఉన్నారంటూ రాఘవులు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కావని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications