రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మెదక్: మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం మెదక్ జిల్లా పుల్కల్ మండలం టార్గాన్ పల్లి గ్రామం వద్ద జరిగింది. ఆర్టీసి బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications