హైదరాబాద్ పేలుళ్ల నిందితుడి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని టాస్క్ ఫోర్సు కార్యాలయంపై ఆత్మాహుతి దాడి కేసులో నిందితుడిని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఈ నెల 18వ తేదీన అరెస్టు చేసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. అతన్ని జ్యుడిష్యల్ కస్టడీకి పంపారు. 2006లో టాస్క్ ఫోర్సు కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా మృతి చెందాడు.
హైదరాబాదు టాస్క్ ఫోర్సు కార్యాలయంపై దాడి కేసు నిందితుడు ముఫ్తీ ఒబెదుల్లా కాన్పూర్, హైదరాబాద్, వారణాసిల్లో దాడులకు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ముఫ్తీ ఒబెదుల్లాను ఢాకా పోలీసులు భారత్ కు అప్పగించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications