ఆగస్టు 18న గ్రేటర్ ఎన్నికలు?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 25న జారీ కానుంది. హైకోర్టు వద్దకు వచ్చిన పిటిషన్ల విషయం 23న తేలుతుందని, మరుసటి రోజున ప్రభుత్వం తన సంసిద్ధతను రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలుపుతుందని, అందు వల్ల 25నే నోటిఫికేషన్ జారీ కావచ్చని తెలుస్తోంది. నోటిఫికేషన్ వెలువడిన 28 రోజులలోపు ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవాలని, వచ్చే నెల 21న రంజాన్ ఉపవాసం, 23న వినాయక చవితి నవరాత్రోత్స వాలు ప్రారంభమవుతాయని, అందువల్ల వాటికి ముందే పోలింగ్ తేదీ ఆగస్టు 18గా ఖరారు కావచ్చునని వారు తెలిపారు.
గతంలో 23 లేదా 24న నోటిఫికేషన్ వచ్చి ఆగస్టు మూడవ వారంలో పోలింగ్ జరగవచ్చుననే వార్తలు వెలువడ్డాయి. కాగా, అన్ని అంశాలనూ పరిశీలించిన ప్రభుత్వం 25న నోటిఫికేషన్ జారీ చేయడానికి రంగం సిద్ధం చేసిందని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు పొత్తుల కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాయి.












Click it and Unblock the Notifications