న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కనికి చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆదేశించింది.