కాంగ్రెసుకు సత్తా దాసోహం: బాబు

గ్రేటర్ ఎన్నికలకు సన్నాహకంగా ఆయన సోమవారం నగర శివార్లలోని శేరిలింగంపల్లి, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల సభల్లో ప్రసంగించారు. తామే హైదరాబాదును అభివృద్ధి చేశామని ఆయన చెప్పుకున్నారు. పేదలకు 60 గజాల భూమి ఇవ్వడానికి మనసురాకపోయినా పెద్దలకు కోట్ల విలువైన భూమిని అన్యాక్రాంతం చేశారన్నారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే కాంగ్రెస్ నేతలు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కందిపప్పు, బియ్యం, చక్కెర, నూనెలు, పప్పులు, కూరగాయలు - అన్నింటి ధరలు కాలుతున్నాయన్నారు. కంది పప్పు కోసం పంట వచ్చేవరకూ ఆగాలని సీఎం అంటే దొడ్డు బియ్యం తినాలని మరో మంత్రి చెబుతున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో వీరికి ప్రజలు షాకి స్తేనైనా ఈ ధరల గురించి పట్టించుకుంటారేమో! వారిని గెలిపిస్తే కందిపప్పు రూ. 200, బియ్యం రూ. 60 కావడం ఖాయం అని హెచ్చరించారు. కాంగ్రెస్, ఎంఐఎంలకు బ్రేక్ పడితేనే నగరం బాగుపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications