సోనియాకు మావోల హెచ్చరిక

దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని చిదంబరం అంటున్నారని, అది చిదంబరం కల మాత్రమేనని, మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడం సాధ్యం కాదని, ధైర్యం ఉంటే చిదంబరం జార్ఖండ్ కు రావాలని సిపిఐ-మావోయిస్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నది. సిపిఐ-మావోయిస్టు రాష్ట్ర కేంద్ర కమిటీ సబ్యుడు అనూప్ జీ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది.
మన్మోహన్ సింగ్ కు, సోనియాకు రాజీవ్ కు పట్టిన గతే పడుతుందని అతను హెచ్చరించాడు. జార్ఖండ్ కాంగ్రెస్ నాయకులను కూడా అతను హెచ్చరించాడు. పార్టీకి రాజీనామా చేయాలని అతను కాంగ్రెసు నాయకులను హెచ్చరించాడు. మావోయిస్టుల 24 గంటల జార్ఖండ్ బంద్ మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమవుతోంది.












Click it and Unblock the Notifications