మైనర్ పై అత్యాచారం: ఎస్సై అరెస్టు
హైదరాబాద్: ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన కూకట్ పల్లి సబ్ ఇన్ స్పెక్టర్ సునీల్ ను మల్కాజిగిరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతన్ని కూకట్ పల్లిలో అరెస్టు చేసి మల్కాజిగిరి పోలీసు స్టేషనుకు తరలించారు. తాను బాలికపై అత్యాచారం చేయలేదని, ఆమె అంగీకారం మేరకే సెక్స్ చేశానని సునీల్ అంటున్నాడు.
మల్కాజిగిరిలో ప్రొబెషనరీ ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సునీల్ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చి తనను మరిచిపోవాలని చెప్పాడని ఆ బాలిక చెప్పింది. తాను ఎస్పైని అని, తలుచుకుంటే మీ తండ్రిని కేసులో ఇరికిస్తానని, తమ మధ్య జరిగిన వ్యవహారాన్ని ఎవరికీ చెప్పవద్దని తనను సునీల్ బెదిరించినట్లు ఆ బాలిక చెప్పింది.












Click it and Unblock the Notifications