జాక్సన్ కు మరో సంతానం?
లండన్: పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ కు నాలుగో సంతానం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయనకు ముగ్గురు సంతానమనే విషయం ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసిన విషయం. జాక్సన్ కు ఒమేర్ భట్టీ అనే నాలుగో సంతానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైఖెల్ స్మారక కార్యక్రమంలో భట్టీని తొలి వరుసలో కూర్చోబెట్టినట్లు చెబుతున్నారు. నార్వేజియన్ డ్యాన్సర్ అయిన భట్టీకి ఇప్పుడు పాతికేళ్లు.
తాను జారస్న్ సంతానమనే విషయాన్ని నిరూపించుకోవడానికి భట్టీ డిఎన్ ఎ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. జూలై 7వ తేదీన జరిగిన మెమోరియల్ సర్వీసులో అతను జాక్సన్ సోదరులు, సోదరీమణుల పక్కన ముందు వరుసలో కూర్చున్నాడు. దీన్ని బట్టి భట్టీ జాక్సన్ కు సన్నిహితుడనే విషయం తేలుతోందని అంటున్నారు.
భట్టీ తల్లి పియా, ఆమె భర్త రిజ్ జాక్సన్ వద్ద పని చేశారు. తాజా ప్రచారంపై మాట్లాడడానికి వారు నిరాకరిస్తున్నారు. జాక్సన్ పాప్ రారాజు అని, తమకు అంతకన్నా ఎక్కువ అని పియా అన్నారు. భట్టీ 1997 నుంచి జాక్సన్ నెవర్ లాండ్ హోంలో చాలా కాలం నివసించాడు.












Click it and Unblock the Notifications