జెపిపై బహిరంగ తిరుగుబాటు

సంస్థాగంత కార్యకర్తలు ఎన్నుకున్న జిల్లా, మండల కమిటీలను ఎందుకు ఏడు నెలల్లోనే ఎందుకు రద్దు చేశారని అసమ్మతి వాదులు జెపిని ప్రశ్నించారు. ధన రాజకీయాలు చేయడానికే లోకసత్తా ఏర్పడిందని వారు విమర్శించారు. జయప్రకాష్ నారాయణపై ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్సలు చేసిన విషయం తెలిసిందే. కులానికి, మతానికి, ప్రాంతానికి తాను, తన పార్టీ అతీతమని చెప్పుకుంటూ రాజకీయ ప్రక్షాళనకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న జెపికి ఈ తిరుగుబాటు తలబొప్పి కట్టించేదే.












Click it and Unblock the Notifications